|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 02:07 PM
సత్తుపల్లి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఎన్నికల్లో కొందరు భార్యాభర్తలు గెలుపొందగా, మరికొందరు ఓటమి పాలయ్యారు. మాజీ ఛైర్మన్ కూసంపూడి మహేష్ 14వ వార్డులో విజయం సాధించగా, ఆయన సతీమణి మాధురి ఓడిపోయారు. అలాగే, ఛైర్మన్ రేసులో ఉన్న రెహనాబేగం 22వ వార్డులో గెలుపొందగా, ఆమె భర్త కమల్ పాషా అపజయం పాలయ్యారు. అత్యంత ప్రతిష్ఠాత్మకంగా జరిగిన ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ 17 అభ్యర్థులతో మెజారిటీ సాధించింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ కేవలం ఆరుగురు అభ్యర్థులతో సరిపెట్టుకుంది.