|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:21 PM
రంగారెడ్డి జిల్లా, రాజేంద్రనగర్ నియోజకవర్గంలోని మైలార్‌దేవ్‌పల్లి డివిజన్ పరిధిలో దుర్గానగర్ నుండి లక్ష్మీగూడ మార్గంలో ప్లాస్టిక్ వ్యర్థాలను తరచూ దహనం చేయడం వల్ల తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోంది. దీనితో స్థానికులు, ముఖ్యంగా వృద్ధులు, పిల్లలు శ్వాస సంబంధిత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే స్పందించి, పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.