|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:41 PM
యాదగిరిగుట్ట,ఆలేరు మున్సిపల్ ఛైర్మన్ పీఠం పై కాంగ్రెస్ జెండా ఎగురవేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు.యాదగిరిగుట్ట మున్సిపాలిటీలో చైర్ పర్సన్ గా గుండ్లపల్లి వాణి భరత్ గౌడ్ గారు ఎన్నికయ్యారు,వైస్ చైర్ పర్సన్ గా బరిగే రమ్య రామచందర్ గారు ఎన్నికయ్యారు.ఈ సందర్భంగా వారి యొక్క ఎన్నిక తర్వాత ప్రమాణ స్వీకారం చేశారు.అనంతరం వారి పదవి బాధ్యతలు చేపట్టారు.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు పాల్గొన్నారు.ఈ శుభ సందర్భంగా మున్సిపల్ కార్యాలయం నుండి వైకుంఠ ధ్వారం వరకు ర్యాలీ నిర్వహించారు.కల్లర్ పూసుకుని స్వీట్స్ పంచుకొని ముదిరాజ్ ఉత్సవాలలో మునిగిపోయారు.