|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 03:49 PM
కాంగ్రెస్ ఎంపీ రేణుకా చౌదరికి సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు జారీ అయ్యాయి. ఈనెల 23లోగా వివరణ ఇవ్వాలని ప్రివిలేజ్ కమిటీ సూచించింది. గతేడాది డిసెంబర్‌లో జరిగిన పార్లమెంట్ శీతాకాల సమావేశాల సమయంలో రేణుకా చౌదరి.. తాను కాపాడిన ఒక వీధి కుక్కను తన కారులో పార్లమెంటుకు తీసుకొచ్చారు. దీనిపై కొందరు సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేయగా "లోపల కూర్చున్నవారే కరుస్తారు, కుక్కలు కరవవు" అని ఆమె వ్యాఖ్యానించినట్లు బీజేపీ ఎంపీలు బ్రిజ్‌లాల్, ఇందుబాల గోస్వామి తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీలను అవమానించేలా, వారి పరువుకు నష్టం కలిగించేలా రేణుక మాట్లాడారని వారు సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇచ్చారు.ఈ ఫిర్యాదును రాజ్యసభ చైర్మన్ ప్రివిలేజ్ కమిటీకి పంపించారు. గత వారం సమావేశమైన కమిటీ ఈ అంశంపై చర్చించి, రేణుకా చౌదరి నుంచి వివరణ కోరాలని నిర్ణయించింది.