|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 12:15 PM
రాజపేట మండలం పుట్టగూడెం గ్రామంలో నిర్వహించిన శ్రీశ్రీ సంత్ సేవాలాల్ మహరాజ్ జయంతి వేడుకల్లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన సంత్ సేవాలాల్ మహరాజ్ విగ్రహానికి పూలమాలలు అర్పించి నివాళులు ఘటించారు. బోగ్ బండార్ పూజలో పాల్గొన్నారు.ముందుగా తండా వాసులు ఘన స్వాగతం పలికారు.ఈ సందర్భంగా బంజారా పాటలకు బీర్ల అయిలయ్య గారు కుటుంబ సభ్యులతో కలిసి బంజారా నృత్యాలు చేసి అందరిని అలరించారు.బంజారా సమాజం అభివృద్ధి, ఐక్యత, సేవా భావం వంటి విలువలను సంత్ సేవాలాల్ మహరాజ్ బోధించినట్లు పేర్కొన్నారు. సమాజ శ్రేయస్సు కోసం ఆయన చూపిన మార్గాన్ని అనుసరించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.గ్రామ పెద్దలు, స్థానిక నాయకులు, యువత పెద్ద సంఖ్యలో హాజరై జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.