|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:11 PM
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని మున్సిపాలిటీల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాయికల్, మెట్ పల్లి, జమ్మికుంట, జగిత్యాల మున్సిపాలిటీల్లో హంగ్ ఏర్పడింది. రాయికల్, మెట్‌పల్లిలో అతిపెద్ద పార్టీగా బీజేపీ ఉంది. జమ్మికుంటలో బీఆర్ఎస్-12, కాంగ్రెస్-10 స్థానాలు గెలుచుకున్నాయి. దీంతో స్వతంత్రులతో కలిపి జమ్మికుంట చైర్మన్ స్థానం దక్కించుకోవడానికి కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. మరోవైపు జగిత్యాలలో వింత పరిస్థితి నెలకొంది. ఎమ్మెల్యే సంజయ్, జీవన్ రెడ్డి వర్గం కౌన్సిలర్లను వేర్వేరుగా క్యాంప్‌కు తరలించారు. దీంతో ఇక్కడ కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్లుగా పరిస్థితి మారింది.