|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 07:25 PM
ఈ రోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 130 సుభాష్ నగర్ డివిజన్ పరిధిలోని శ్రీ రామ సొసైటీ కాలనీలో గల కామాక్షి సామేత ఏకాంబర్ నాథ్ స్వామి ఆలయ 7వ వార్షికోత్సవంలో బిఆర్ఎస్ఎల్పీ విప్, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, భక్తులతో కలిసి ఆశీర్వాదాలు పొందారు.అనంతరం ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ, ఆలయాలు ఆధ్యాత్మికతకు, సాంస్కృతిక విలువలకు కేంద్రబిందువులని తెలిపారు. ఇలాంటి వార్షికోత్సవాలు సమాజంలో ఐక్యతను పెంపొందించి, భక్తి భావాన్ని మరింత బలపరుస్తాయని అన్నారు. ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఎమ్మెల్యే గారిని శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్ సీనియర్ నాయకులు బలరాం రెడ్డి, భాస్కర్ రెడ్డి, ఇస్మాయిల్, గుబ్బాల లక్ష్మీ నారాయణ, ఆలయ కమిటీ సభ్యులు సత్యనారాయణ, నాయుడు, రవి, రాజా, బుజ్జి, భద్రయ్య, రాజు, దుబాయ్ శ్రీను, హరీష్, గిరి, 129 డివిజన్ అధ్యక్షులు పుప్పాల భాస్కర్, సంపత్ మాధవ్ రెడ్డి, కుంట సిద్ధిరాములు, సుధాకర్ గౌడ్, నరేందర్ రెడ్డి, మేడి చంద్ర శేఖర్ మరియు భక్తులు, స్థానికులు పాల్గొన్నారు.