|
|
by Suryaa Desk | Mon, Feb 16, 2026, 10:43 AM
మెదక్ జిల్లా పాపన్నపేట మండలంలోని నాగసానుపల్లి గ్రామంలో ఉన్న శ్రీ ఏడుపాయల వన దుర్గ భవాని అమ్మవారి ఆలయంలో సోమవారం రెండో రోజు జాతర వైభవంగా కొనసాగింది. ఈ సందర్భంగా అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి, విశేష పూజలు, అభిషేకాలు, హారతులు నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు.మూడు రోజులు జరిగే జాతరను ఆదివారం మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు దంపతులు,అదనపు కలెక్టర్ నగేశ్‌తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్ర్తాలు సమర్పించి ప్రారంభించారు.వివిధ ప్రాంతాలకు చెందిన లక్షలాది మంది భక్తులు మహాశివరాత్రిని పురస్కరించుకొని ఏడుపాయలకు చేరుకున్నారు.మంజీరా పాయల్లో పుణ్యస్నానాలు చేసి శివరాత్రి ఉపవాస దీక్షలు చేపట్టారు.చాలామంది ఉపవాస దీక్షలు చేపట్టాలనే ఉద్దేశంతో శనివారం రాత్రే ఏడుపాయలకు చేరుకోగా మరికొంత మంది తెల్లవారు జామున చేరుకున్నారు.ఉదయం నుంచి గంట గంటకూ ఏడుపాయలకు వచ్చే భక్తుల సంఖ్య పెరుగుతూ వచ్చింది.పోతంశెట్టిపల్లి వైపు నుంచి వచ్చిన భక్తులు రెండో బ్రిడ్జి వద్ద పార్కింగ్ ప్రదేశంలో తమ వాహనాలు నిలిపి కిలోమీటర్ నడుచుకుంటూ ఏడుపాయలకు చేరుకున్నారు.