|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 12:19 PM
గడ్డిపోతారం, గుమ్మడిదల మున్సిపాలిటీలను కైవసం చేసుకున్న బీఆర్‌ఎస్ ఇంద్రేశం మున్సిపాలిటీని సైతం దక్కించుకుంది. మొత్తం 18 వార్డులకు గాను 9 వార్డులో బీఆర్‌ఎస్ అభ్యర్థులు గెలుపొందారు. ఆరు కాంగ్రెస్, బీజేపీ రెండు ఒకరు స్వతంత్య్ర అభ్యర్థి విజయం సాధించారు.జిల్లాలోని మున్సిపాలిటీలపై గులాబీ జెండా రెపరెపలాడుతుంది . జిల్లాలోని గుమ్మడిదల మున్సిపాలిటీ బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. మొత్తం. 22 వార్డులకు గాను 15 వార్డుల్లో బీఆర్‌ఎస్( BRS) విజయ కేతనం ఎగురవేసింది. నాలుగు చోట్ల కాంగ్రెస్ ,రెండు చోట్ల బీజేపీ , ఒకరు స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. సంగారెడ్డి జిల్లా గడ్డిపోతారం మున్సిపాలిటీని గులాబీ పార్టీ కైవసం చేసుకుంది. మున్సిపాలిటీలో మొత్తం 18 వార్డులు ఉండగా.. 14 బీఆర్ఎస్ అభ్యర్థులు విజయం సాధించారు. ఇక కాంగ్రెస్ మూడు వార్డులు, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో గెలుపొందారు.