|
|
by Suryaa Desk | Fri, Feb 13, 2026, 04:37 PM
వరంగల్ జిల్లా వర్ధన్నపేట మున్సిపాలిటీ 12వ వార్డు ఎన్నికల ఫలితాలు రీకౌంటింగ్‌లో తారుమారు కావడంతో కౌంటింగ్ కేంద్రం వద్ద ఉద్రిక్తత నెలకొంది. మొదట బీఆర్‌ఎస్ అభ్యర్థి 7 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించగా, కాంగ్రెస్ అభ్యర్థి అభ్యంతరంతో రీకౌంటింగ్ జరగగా, కాంగ్రెస్ అభ్యర్థి 13 ఓట్లతో గెలిచినట్లు అధికారులు ప్రకటించారు. అధికార కాంగ్రెస్ ఒత్తిడితోనే ఫలితాలు తారుమారు చేశారని బీఆర్‌ఎస్ నేతలు ఆరోపిస్తూ ఆందోళనకు దిగారు. పోలీసులు భారీగా మోహరించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.