|
|
by Suryaa Desk | Sat, Feb 14, 2026, 09:47 PM
ఫార్ములా-ఈ కార్ రేస్ కేసులో(Formula-E Race Case) ఒక కీలక మలుపు ఏర్పడింది. ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్(IAS Arvind Kumar) పై ప్రాసిక్యూషన్ ప్రారంభించడానికి కేంద్రం అనుమతి ఇచ్చింది.ఇప్పటికే బీఆర్ఎస్ నేత కేటీఆర్(KTR) పై ప్రాసిక్యూషన్ కోసం గవర్నర్ నుండి మంజూరు లభించిందని తెలుస్తుంది. రాజకీయ నాయకులు, అధికారులు లాంటి వ్యక్తులపై ప్రాసిక్యూషన్‌కు కేంద్ర అనుమతి వచ్చిన తరువాత, ఏసీబీ అధికారులు ఛార్జిషీట్ దాఖలుకు సిద్ధమవుతున్నారు.తదుపరి పరిణామంగా, ఫార్ములా-ఈ కేసుకు సంబంధించి ఏసీబీ అధికారులు తుది నివేదికను సిద్ధం చేశారు. ఈ నివేదికలో ముఖ్యమైన అంశాలు ప్రస్తావించబడ్డాయి. ఇందులో మాజీ మంత్రి కేటీఆర్, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, BLN రెడ్డి, అలాగే FEO ప్రతినిధులు కీలకంగా ఉన్నారు. నివేదిక ప్రకారం, ఫార్ములా-ఈ కార్ రేస్ నిర్వహణ కేటీఆర్ సొంత నిర్ణయం అని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం అనుమతులు లేకుండా రేస్ నిర్వహించడంతో, క్విడ్ ప్రో కో జరుగిందని వివరించారు. అలాగే, బీఆర్ఎస్‌కు రూ.44 కోట్ల ఎలక్ట్రోరల్ బాండ్లు అందాయని, ట్రైపార్టీ అగ్రిమెంట్‌కు ముందే ఈ బాండ్లు చెల్లించబడినట్లు తుది నివేదికలో పేర్కొన్నారు.