|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 11:48 AM
నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు వేడుకలో పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ . KBN యంగ్ స్టార్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన నైట్ క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న మాద్రి పృథ్వీరాజ్ గారు విజేతలకు ట్రోఫీలు అందజేసి క్రీడాకారులను అభినందించారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు మాట్లాడుతూ యువత క్రీడల్లో పాల్గొనడం వల్ల క్రమశిక్షణ, ఐక్యత, నాయకత్వ లక్షణాలు పెరుగుతాయని, ఇలాంటి క్రీడా కార్యక్రమాలు సమాజానికి మంచి సందేశాన్ని ఇస్తాయని తెలిపారు.విజేత జట్టుకు 11,111/-రూపాయలను రన్నర్ లకు 6,666/- పృథ్వీరాజ్ గారు అందించారు. ఈ సందర్భంగా విజేతలకు మరియు పాల్గొన్న జట్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు