|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 09:42 PM
బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌కు మంచిర్యాల జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది. మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి ఘటనలో ఆయనతో పాటు మరో ముగ్గురికి కోర్టు బెయిల్ మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. గత నెలలో జరిగిన మున్సిపల్ ఎన్నికల అనంతరం క్యాతనపల్లిలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఫిబ్రవరి 18న మంత్రి వివేక్ కాన్వాయ్‌పై జరిగిన దాడి కేసులో బాల్క సుమన్ అరెస్టయ్యారు.ప్రస్తుతం బాల్క సుమన్ ఆదిలాబాద్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. కోర్టు ఆయనకు రూ.25 వేల పూచీకత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ప్రతి ఆదివారం రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్‌కు హాజరు కావాలని ఆదేశించింది. క్యాతనపల్లి మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఎక్కువ మంది విజయం సాధించారు. దీంతో ఛైర్మన్, వైస్ ఛైర్మన్ ఎన్నిక పలుమార్లు వాయిదాపడిన నేపథ్యంలో ఉద్రిక్తతలు తలెత్తాయి.