|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 12:43 PM
బాల్య వివాహాల నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కలెక్టర్ ప్రతిమ సింగ్ పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్‌లో స్త్రీ, శిశు సంక్షేమ శాఖ, ప్లాన్ ఇండియా సంయుక్తంగా రూపొందించిన 'బాల్య వివాహ ముక్త భారత్' ప్రచార గోడపత్రికను ఆమె ఆవిష్కరించారు. జిల్లాను బాల్య వివాహ రహితంగా మార్చేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని, సమాజంలో ఈ దురాచారంపై విస్తృత అవగాహన కల్పించాలని ఆమె కోరారు.