|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:22 PM
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్ విషయంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇరాన్ ఇటీవల తమ పొరుగున ఉన్న అరబ్ దేశాలపై దాడులు చేయడంతో వారి వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని, అమెరికాతో కలిసి ఇరాన్‌పై సైనిక చర్యకు వారు సిద్ధంగా ఉన్నారని ట్రంప్ ప్రకటించారు. ఇది తమకు కూడా ఆశ్చర్యం కలిగించిందని ఆయన పేర్కొన్నారు. బహ్రెయిన్, జోర్డాన్, కువైత్, ఖతర్, యూఏఈ వంటి దేశాలపై ఇరాన్ దాడులు జరిపిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ట్రంప్ మాట్లాడుతూ.. "మొదట్లో ఈ విషయంలో జోక్యం చేసుకోబోమని చెప్పారు. మేమే చూసుకుంటామని వారికి చెప్పాం. కానీ ఇప్పుడు వారే మాతో కలిసి రంగంలోకి దిగుతామని ముందుకొచ్చారు" అని మీడియాకు వివరించారు. అరబ్ దేశాల నాయకత్వం ఎంతో తెలివైనదని, శక్తిమంతమైనదని ఆయన ప్రశంసించారు. ఇరానియన్లు ఒక హోటల్, అపార్ట్‌మెంట్‌ను లక్ష్యంగా చేసుకోవడం గల్ఫ్ దేశాలకు మరింత ఆగ్రహం తెప్పించిందని అన్నారు.