|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:26 PM
భారత్ తమపై మరో యుద్ధానికి సన్నాహాలు చేస్తోందని పాకిస్థాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ సంచలన ఆరోపణలు చేశారు. సరిహద్దుల్లో భారత సైనిక కదలికలు భారీగా పెరిగాయని, ఈ పరిణామాలు ప్రాంతీయ శాంతికి తీవ్ర విఘాతం కలిగిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. సోమవారం పార్లమెంట్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో జర్దారీ ప్రసంగించారు.సింధు నదీ జలాల ఒప్పందం నుంచి భారత్ ఏకపక్షంగా వైదొలగడాన్ని జర్దారీ తీవ్రంగా తప్పుబట్టారు. దీన్ని ఆయన 'జల ఉగ్రవాదం' (హైడ్రో టెర్రరిజం)గా అభివర్ణించారు. "భారత్ నీటిని ఒక ఆయుధంగా మార్చి, పాకిస్థాన్ వ్యవసాయ రంగాన్ని దెబ్బతీయాలని చూస్తోంది. ఇది అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడమే" అని ఆయన ఆరోపించారు. కశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించనంత వరకు దక్షిణాసియాలో శాంతి ఒక కలగానే మిగిలిపోతుందని జర్దారీ పునరుద్ఘాటించారు. యుద్ధ క్షేత్రం నుంచి వైదొలగి, చర్చల వేదికపైకి రావాలని భారత్‌కు ఆయన విజ్ఞప్తి చేశారు.