|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 11:11 AM
నాగర్‌కర్నూల్‌లో కడుపునొప్పితో బాధపడుతున్న 16 ఏళ్ల బాలిక స్కానింగ్ సెంటర్‌లోని టాయిలెట్‌లో సోమవారం సాయంత్రం మగ శిశువుకు జన్మనిచ్చింది. గమనించిన బాలిక తల్లి శిశువును చెత్తబుట్టలో వేసేందుకు ప్రయత్నించగా, సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బాలికను, శిశువును జనరల్ ఆస్పత్రికి తరలించగా, వారిద్దరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.