|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 11:24 AM
నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, ప్రభుత్వం ప్రజల కోసం తీసుకువస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసేలా జర్నలిస్టులు కృషి చేయాలని కోరారు. నల్గొండలో సోమవారం ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో ఆమె నివాసంలో జరిగిన సన్మాన కార్యక్రమంలో మేయర్ ఈ వ్యాఖ్యలు చేశారు. నల్గొండ మొట్టమొదటి మేయర్‌గా బాధ్యతలు స్వీకరించిన ఆమెను ఘనంగా సత్కరించారు.