|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 02:17 PM
పటాన్చెరు డివిజన్ పరిధిలోని MG రోడ్డులో శ్రీమతి & శ్రీ శిరీష లక్ష్మి శాంతారామ్ గార్లు ఏర్పాటు చేసిన నూతన విద్యుత్ ఆధారిత ( ఎలక్ట్రికల్ వెహికల్స్ ) వాహనాల సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవంలో పటాన్చెరువు శాసనసభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి గారు, పటాన్చెరువు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గార్లు ముఖ్య అతిథులుగా పాల్గొని నూతన సర్వీస్ సెంటర్ ను ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ గారు మాట్లాడుతూ నూతన సర్వీస్ సెంటర్ ను ప్రారంభించిన శిరీష శాంతారామ్ గార్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, పెట్రోల్ కు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం విద్యుత్ ఆధారిత వాహనాల వాడకం మార్కెట్లో అధికంగా ఉందని అయితే వాటికి సరైన సర్వీస్ సెంటర్లు అందుబాటులో లేక వాహన యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని దానికి పరిష్కారంగా ఇలాంటి EV సర్వీస్ సెంటర్లు పెట్టడ చాలా హర్షించదగ్గ విషయమని అన్నారు.