|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 03:51 PM
హైదరాబాద్-వనస్థలిపురంలోని గ్రీన్ సిటీ కాలనీలోని ఓ అపార్ట్‌మెంట్‌లో ఘటన . తన మాజీ భార్య సునీతను చంపిన మహేశ్ అనే వ్యక్తి.హైదరాబాద్ సిటీ శివార్లలోని వనస్థలిపురంలో జరిగిన హత్య.. అందర్నీ షాక్ కు గురి చేసింది. పట్టపగలు.. ఇంట్లోనే జరిగిన ఈ ఘటన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.వనస్థలిపురం గ్రీన్ సిటీ కాలనీ. ఈ కాలనీలో ఓ అపార్ట్ మెంట్ లో భర్తతో కలిసి ఉంటుంది సునీత అనే మహిళ. 2026, ఫిబ్రవరి 18వ తేదీ ఉదయం.. మహేష్ అనే వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు. వస్తూనే పెద్దగా అరుపులు, కేకలు. కత్తులతోపాటు తన వెంట పెట్రోల్ బాటిళ్లు తెచ్చాడు మహేష్.. ఇంట్లోకి వస్తూనే.. తన దగ్గరకు ఎవరైనా వస్తే పెట్రోల్ పోసి ఇంటిని తగలబెడతా అంటూ బెదిరించాడు. ఆ వెంటనే.. ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. తన వెంట తెచ్చుకున్న కత్తులను బయటకు తీశాడు. సునీతను ఇంట్లోనే నరికి చంపాడు. సునీత.. హైదరాబాద్ సిటీలోని ఓ ఐటీ కంపెనీలో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తుంది. ఇక మహేష్ విదేశాల్లో సాఫ్ట్ వేర్ ఉద్యోగం. NRI.. సునీత.. మహేష్ మధ్య సంబంధం ఏంటీ అంటారా. ఐదేళ్ల క్రితం వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు. ఆ తర్వాత గొడవలు వచ్చాయి. రెండు కుటుంబాల మధ్య వివాదం రావటంతో.. మహేష్ కు విడాకులు ఇచ్చింది సునీత. విడాకుల తర్వాత సునీత మరో వ్యక్తిని పెళ్లి చేసుకున్నది. కొత్త లైఫ్ స్టార్ట్ చేసింది సునీత. విడాకుల తర్వాత మరో పెళ్లితో కొత్త జీవితం స్టార్ట్ చేసిన సునీత.. తన బతుకు ఏదో తను బతుకుతున్నది. సునీతపై పగ పెంచుకున్న మహేష్.. తన మాజీ భార్యను చంపాలన్న ఉద్దేశంతో.. పక్కా ప్లాన్ ప్రకారం.. ఇంటికి వచ్చి మరీ చంపినట్లు చెబుతున్నారు స్థానికులు. పాత గొడవలను మనస్సులో పెట్టుకున్న మహేష్.. సునీతను చంపాలనే ఉద్దేశంతోనే ఇంటికి వచ్చి చంపినట్లు స్థానికులు చెబుతున్నారు.