|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 10:57 AM
హైదరాబాద్ సిటీలో దారుణం చోటు చేసుకుంది. నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో, ముగ్గురు రౌడీషీటర్లు మైనర్ బాలికకు గంజాయి ఇచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు. బాలిక మత్తులో ఉన్నప్పుడు ఈ ఘోరం జరిగింది. ప్రస్తుతం బాలిక ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది, ఆమె పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చార్మినార్ పోలీస్ స్టేషన్ పరిధిలో నుంచి బాలిక వెళ్ళినట్లు పోలీసులు పేర్కొన్నారు. నానమ్మతో నివసిస్తున్న బాలిక కోసం నార్సింగి పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు నమోదైంది. బాధితురాలు నెక్నంపూర్ డివిజన్ పాషా కాలనీకి చెందినట్లు గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. బాలికపై దారుణానికి పాల్పడిన ముగ్గురు రౌడీషీటర్లు పరారీలో ఉండటంతో వారికోసం గాలింపు చర్యలు చేపట్టారు. అయితే, బాలికకు, రౌడీషీటర్లకు ఇంతకుముందు ఏమైనా పరిచయం ఉందా.. లేదంటే బాలికను బలవంతంగా తీసుకొచ్చి గంజాయి మత్తు ఇచ్చి శివారు ప్రాంతాలకు తీసుకెళ్లారా.. ఏం జరిగిందనే కోణంలోనూ పోలీసులు విచారణ చేస్తున్నారు. బాలిక స్పృహలోకి వచ్చిన తరువాత ఈ ఘటనపై మరిన్ని వివరాలు సేకరించేందుకు పోలీసులు సిద్ధమైనట్లు తెలుస్తోంది.