|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 11:16 AM
తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజుకుంది. బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు ఆదిలాబాద్‌కు బయలుదేరారు. మంచిర్యాల జిల్లా క్యాతన్‌పల్లి మున్సిపల్ చైర్మన్ ఎన్నికల అల్లర్ల కేసులో బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్ట్ చేసి, 14 రోజుల రిమాండ్‌కు తరలించారు. ఈ నేపథ్యంలో, పార్టీ నేతకు మద్దతుగా హరీష్ రావు జైలుకు వెళ్లి ములాఖత్ కానున్నారు. ఈ పర్యటనతో ఆదిలాబాద్ జిల్లాలో రాజకీయ వాతావరణం ఉత్కంఠభరితంగా మారింది.