|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 09:57 PM
పటాన్చెరు నియోజకవర్గం బీరంగూడలోని గ్రీన్ మెడోస్ కాలనీ సమీపంలో నూతనంగా ప్రారంభమైన మామాస్ రెస్టారెంట్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై, బీఆర్ఎస్ నాయకులు, MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాద్రి పృథ్వీరాజ్ గారు రెస్టారెంట్‌ను ప్రారంభించారు.ఈ సందర్భంగా పృథ్వీరాజ్ గారు నిర్వాహక బృందానికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేలా వ్యాపారాన్ని అభివృద్ధి పరచాలని సూచించారు. నాణ్యమైన ఆహారం, పరిశుభ్రమైన వాతావరణం, వినియోగదారులకు ఉత్తమ సేవలు అందించడం ద్వారా సంస్థ మంచి పేరు సంపాదించాలని ఆకాంక్షించారు.ప్రాంతీయ ఆర్థికాభివృద్ధికి, ఉపాధి సృష్టికి ఇలాంటి వ్యాపార సంస్థలు దోహదపడతాయని ఆయన పేర్కొన్నారు.