|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 09:00 PM
హైదరాబాద్ జిల్లా కలెక్టర్ హరిచందన దాసరిని బుధవారం కార్వాన్ ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ కలిశారు. నియోజకవర్గంలోని కొన్ని సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి వినతిపత్రం అందజేశారు. ఎమ్మెల్యే తెలిపిన వివరాల ప్రకారం, కలెక్టర్ సానుకూలంగా స్పందించి, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ భేటీలో నియోజకవర్గ సమస్యలపై చర్చ జరిగింది.