|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 02:34 PM
కీసరగుట్ట మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా 5వ రోజు వసంతోత్సవం, పుష్పయాగాన్ని ఆలయ వేద పండితులు, ప్రధాన పూజారుల ఆధ్వర్యంలో ఆలయ ఛైర్మన్ వెంకటేశ్ శర్మ దంపతులు నిర్వహించారు. ఆలయ మండపంలో భవాని రామలింగేశ్వర స్వామికి బ్రహ్మోత్సవాల ముగింపులో పుష్పాలు, పుష్పయాగం చేశారు. వసంత రుతువులో ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, స్వామివారికి పసుపు, చందనం వంటి వాటితో వసంతోత్సవం చేశారు.