|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 02:28 PM
తెలంగాణ, హైదరాబాద్‌లోని నాంపల్లి క్రిమినల్ కోర్టుకు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. మధ్యాహ్నం 12.05 గంటలకు బాంబు పేలుతుందంటూ గుర్తు తెలియని వ్యక్తుల నుంచి ఈ బెదిరింపు మెయిల్ వచ్చింది. దీంతో బాంబు స్క్వాడ్ కోర్టులో తనిఖీలు చేపట్టింది.నాంపల్లి క్రిమినల్ కోర్టుతో పాటు తెలుగు రాష్ట్రాలలో పలు న్యాయస్థానాలకు కూడా బాంబు బెదిరింపులు వచ్చాయి. కరీంనగర్, రాజమండ్రి జైళ్లకు కూడా బాంబు బెదిరింపు కాల్స్ వచ్చాయి. దీంతో ఆయా కోర్టులలో ఉన్న సిబ్బందిని బయటకు పంపించి బాంబు స్క్వాడ్ తనిఖీలు చేపట్టింది. అయితే ఇప్పటి వరకు ఎక్కడా అనుమానాస్పద వస్తువులు లభ్యం కాలేదు. తనిఖీలు కొనసాగుతున్నాయి.