|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 03:58 PM
హిందూ సంస్కృతి, సంప్రదాయాలు, ఆత్మగౌరవాన్ని కాపాడేందుకు సింహస్వప్నం లా దూకి, స్వరాజ్యాన్ని స్థాపించిన మహానుభావుడు ఛత్రపతి శివాజీ మహరాజ్ గారు. వారి జయంతి సందర్భంగా దేశ ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు.కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, దుండిగల్ సర్కిల్, భౌరంపేట్ లో ఈరోజు ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి సందర్భంగా గ్రామ శివాజీ యూత్ ఆధ్వర్యంలో వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో ఉన్న శివాజీ మహరాజ్ విగ్రహానికి పూల మాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. గ్రామంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. జై భవాని...వీర శివాజీ నినాదాలతో గ్రామం మెత్తం మారుమ్రోగిపోయింది.అనంతరం గ్రామ పెద్దలు మాట్లాడుతూ స్థానిక యువత శివాజీ యూత్ వారు గత 18 సంవత్సరాలుగా ఎంతో ఘనంగా , నిర్విరామంగా ఛత్రపతి శివాజీ మహరాజ్ జయంతి వేడుకలను నిర్వహిస్తున్నారని అన్నారు. వారికి అభినందనలు తెలిపారు. ధర్మ రక్షణ, గో రక్షణ, స్వదేశాభిమానం కోసం శివాజీ మహరాజ్ చూపిన పరాక్రమం భారత చరిత్రలో సువర్ణాక్షరాలతో నిలిచిపోయిందని అన్నారు. హిందూ సమాజంలో ఐక్యత, ధైర్యం, నీతి పాలనకు ప్రతీకగా నిలిచిన ఆయన ఆశయాలు ప్రతి భారతీయునికి శాశ్వత స్ఫూర్తినివ్వాలని అన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.