|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:17 PM
రాష్ట్రంలో ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించారంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని, తెలంగాణ కాంగ్రెస్ నాయకులను అభినందించారు. ఢిల్లీలోని ఖర్గే నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, దామోదర రాజనర్సింహ, మల్లు భట్టివిక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, నామా నాగేశ్వరరావు ఆయనను కలిశారు. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక మున్సిపాలిటీలను కైవసం చేసుకున్నట్లు తెలంగాణ కాంగ్రెస్ నాయకులు వారి దృష్టికి తీసుకువెళ్లారు. ఫలితాలపై రాహుల్ గాంధీ, ఖర్గే అభినందించారు.ఈ సందర్భంగా ఖర్గే మాట్లాడుతూ, మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై సమీక్ష నిర్వహించినట్లు తెలిపారు. సమావేశంలో భవిష్యత్తు కార్యాచరణపై చర్చించామని అన్నారు. తెలంగాణకు పార్టీ ఇచ్చిన హామీలను కచ్చితంగా అమలుచేస్తామని స్పష్టం చేశారు. సమానత్వంతో కూడిన తెలంగాణ నిర్మాణానికి తాము కట్టుబడి ఉన్నామని అన్నారు.