|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:18 PM
ఛత్తీస్‌గఢ్ పోలీసులు తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లోని కర్రెగుట్టలో కూంబింగ్‌ను కొనసాగిస్తున్నాయి. ఈ క్రమంలో ఈరోజు భద్రతా దళాలు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి దేవ్‌జీ, జూనియర్ క్యాడర్‌కు చెందిన బెటాలియన్ ఇన్‌ఛార్జ్ కేసా సోధీ ఈ ప్రాంతంలో ఉన్నట్లు పక్కా సమాచారం అందడంతో పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టారు.సుమారు రెండు వేల మంది జవాన్లు కర్రెగుట్ట అటవీ ప్రాంతంలో రెండు రోజులుగా జల్లెడ పడుతుండగా బలగాలకు మావోయిస్టులు తారసపడ్డాయి. ఈ క్రమంలో మావోయిస్టులు కాల్పులు జరపగా, పోలీసులు ఎదురు కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు మావోయిస్టులు మృతి చెందారు.