|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 05:20 PM
తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకుని ఇంకా ఎన్ని రోజులు రాజకీయం చేస్తారని మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్యాణ లక్ష్మి-షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ, దేశానికి జాతిపిత ఒకరేనని, అది మహాత్మాగాంధీ అని అన్నారు.తెలంగాణ ఎవరి జాగీరు కాదని మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమంలో ప్రతి ఒక్కరు పాల్గొన్నారని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ జాతిపిత ఎలా అయ్యారని ప్రశ్నించారు. జాతిపిత అని చెప్పుకోవడానికి సిగ్గుండాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. జాతిపిత అయితే ప్రజల్లోకి వచ్చి సమస్యలపై ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.