|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 03:32 PM
నల్గొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్న మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, చిట్యాల సమీపంలోని గుండ్రాంపల్లి వద్ద జరిగిన రోడ్డు ప్రమాదాన్ని చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయ్‌ను ఆపి, క్షతగాత్రులను పరామర్శించి, తన వాహన శ్రేణిలోని అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించేలా చర్యలు తీసుకున్నారు. అలాగే వైద్యులతో మాట్లాడి బాధితులకు తక్షణ వైద్యసహాయం అందేలా ఆదేశాలు జారీ చేశారు. బాధితుల ఆరోగ్య పరిస్థితిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలని అధికారులకు సూచించారు. ఇది చూసిన వారంత మంత్రిపై ప్రశంసలు కురిపిస్తున్నారు.