|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 03:23 PM
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం, శ్రీ భీమేశ్వర స్వామి ఆలయాల్లో మహాశివరాత్రి సందర్భంగా లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేసిన ఆలయ ఈవో శ్రీమతి ఎల్. రమాదేవిని ఆలయ ఉద్యోగులు సన్మానించారు. జాతర విజయవంతం కావడానికి సహకరించిన చైర్‌పర్సన్, జిల్లా కలెక్టర్ గరీమ అగర్వాల్, ఎస్పీ మహేష్ బి. గీతే, వివిధ శాఖల అధికారులకు, సిబ్బందికి ఈవో కృతజ్ఞతలు తెలిపారు. ఔట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ సిబ్బంది సమన్వయంతో పనిచేసి జాతర విజయానికి తోడ్పడ్డారని ఆమె అభినందించారు.