|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 03:51 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి కొంతమంది విమర్శలు గుప్పిస్తున్నారని, ఆయన ఏ జాతికి జాతిపిత అని ఎద్దేవా చేస్తున్నారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమది రాణీ రుద్రమ, సమ్మక్క సారక్క, దొడ్డి కొమురయ్య వంటి తెలంగాణ మహాపురుషుల జాతి అని ఆయన అన్నారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేసీఆర్ పుట్టిన రోజు శుభాకాంక్షలు నిర్వహించారు.ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, తాము ప్రతిపక్షంలోకి వచ్చాక కేసీఆర్‌ను తూలనాడుతూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ జాతి గురించి అడుగుతున్నారని, కానీ తెలంగాణ మట్టితో మమేకమైన వారికి, ఉద్యమాల ఉగ్గుపాలు తాగిన వారికి, ఆత్మగౌరవ పోరాటంలో కలిసి నడిచిన వారికి మాత్రమే జాతి అంటే ఏమిటో తెలుస్తుందని అన్నారు. కానీ సమైక్యాంధ్ర సంచులు మోసిన వారికి జాతి గురించి ఏం తెలుస్తుందని అన్నారు.