|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:22 PM
గద్వాల జిల్లాల్లో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ సంతోష్ ఆదేశించారు. గద్వాలలో 14 కేంద్రాల్లో 8,471 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసు బందోబస్తు, ఆర్టీసీ బస్సులు, ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మందులతో మెడికల్ పాయింట్లు, సీసీ కెమెరాలు, విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలని సూచించారు. సెల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదని, 144 సెక్షన్ విధించి, జిరాక్స్ సెంటర్లను మూసివేయాలని ఆదేశించారు. మంగళవారం జరిగిన సమావేశాల్లో ఈ నిర్ణయాలు తీసుకున్నారు