|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:20 PM
హుజూరాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించడాన్ని పురస్కరించుకుని, రాష్ట్రంలో ఏ ఎన్నిక జరిగినా కాంగ్రెస్ జెండానే ఎగురుతుందని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం యూసఫ్‌గూడలోని తన కార్యాలయంలో ఆయనను నాయకులు సన్మానించారు. హుజూరాబాద్‌లో ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించామని, బీఆర్ఎస్‌కు ప్రజలు గుణపాఠం చెప్పారని తెలిపారు. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ 16 వార్డుల్లో విజయం సాధించగా, బీఆర్ఎస్ 8 వార్డులు గెలుచుకుందని, రానున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఆయన వ్యాఖ్యానించారు.