|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:13 PM
ఎల్లారెడ్డి సెగ్మెంట్ నాగిరెడ్డిపేట మండలం పోచారం ప్రాజెక్టు నుంచి యాసంగి పంటల కోసం నీటి విడుదల కొనసాగుతోందని నీటిపారుదల డిఈ తెలిపారు. బుధవారం ఔట్ ఫ్లో 159 క్యూసెక్కులుగా ఉండగా, 32 క్యూసెక్కులు ఆవిరిగా మారుతున్నాయని చెప్పారు. ఇన్ ఫ్లో లేనప్పటికీ ఇప్పటి వరకు 0.487 టీఎంసీల నీటి విడుదల జరిగిందని, ప్రాజెక్ట్ నీటిమట్టం 1.820 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటిమట్టం 1.137 టీఎంసీలు ఉందని తెలిపారు.