|
|
by Suryaa Desk | Wed, Feb 18, 2026, 12:38 PM
చెన్నూరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై కేసు నమోదైంది. కేతన్‌పల్లి మున్సిపల్ కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవాల సందర్భంగా పోలీసు బందోబస్తుకు ఆటంకం కలిగించారని, ఆ క్రమంలో కోటపల్లి ఎస్ఐ రాజశేఖర్, కానిస్టేబుల్ రాకేజ్ కు గాయాలు అయ్యాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. కాసిపేట ఎస్‌హెచ్ఓ గంగారం ఇచ్చిన ఫిర్యాదుతో రామకృష్ణాపూర్ పోలీస్ స్టేషన్ లో బాల్క సుమన్ తో పాటు మరో ఐదుగురు బీఆర్ఎస్ నేతలపై కేసులు నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో చెన్నూరు బీఆర్ఎస్ కౌన్సిలర్ అనిల్ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో పాటు మిగిలిన నాయకులను అరెస్టు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. మరోవైపు బాల్క సుమన్ ఇంటి వద్ద పోలీసులను మోహరించారు. సుమన్‌ను అరెస్టు చేస్తారన్న సమాచారంతో భారీగా బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి వద్దకు చేరుకొని మంత్రి వివేక్ వెంకట స్వామికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు.