|
|
by Suryaa Desk | Thu, Feb 19, 2026, 04:04 PM
పటాన్చెరు డివిజన్ పరిధిలోని గోకుల్ నగర్ కాలనీలో సోమవంశి ఆర్య క్షత్రియ సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ చత్రపతి శివాజీ మహారాజ్ గారి 396 వ జయంతి ఉత్సవాలలో పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో సపాన దేవ్ గారు,ప్రకాశ్ రావు గారు,నర్రా బిక్షపతి గారు,పృధ్వీరాజ్ గారు, బండ్లగూడ పట్టణ అధ్యక్షుడు భారత్ కుమార్ గారు, ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు,నవీన్ రెడ్డి గారు, గొల్ల కృష్ణ యాదవ్ గారు,కార్ రాజు గారు, మీ సేవ సంజీవ్ గారు తదితరులు పాల్గొన్నారు.అనంతరం పటాన్చెరు డివిజన్ పరిధిలోని బండ్లగూడ, భూపాల్ రెడ్డి కాలనీలో గల శ్రీ అభయాంజనేయ స్వామి వారి ఆలయ 12వ వార్షికోత్సవ కార్యక్రమంలో పటాన్చెరు తాజా మాజీ కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ గారు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మెట్టు కుమార్ యాదవ్ గారు స్వామి వారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ ఉత్సవాలలో పాల్గొనే భక్తులకు మెట్టు కుమార్ యాదవ్ గారు సొంత నిధులతో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మెట్టు కుమార్ యాదవ్ గారు భక్తులకు ఆహారం వడ్డించడం జరిగింది. ఈ కార్యక్రమంలో బండ్లగూడ పట్టణ ప్రెసిడెంట్భారత్ కుమార్ గారు,ఆల్విన్ కాలనీ ప్రెసిడెంట్ సత్యనారాయణ గారు, గొల్ల కృష్ణ యాదవ్ గారు,అఫ్జల్ గారు, కార్ రాజుగారు స్థానిక కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు.