|
|
by Suryaa Desk | Tue, Feb 17, 2026, 04:01 PM
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన మనవడు కల్వకుంట్ల హిమాన్షు రావు హృదయపూర్వక పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా తన తాత గురించి సోషల్ మీడియాలో పెట్టిన ఓ భావోద్వేగభరిత పోస్ట్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. తాతామనవడి మధ్య ఉన్న అనుబంధాన్ని ఈ పోస్ట్ అద్భుతంగా ఆవిష్కరించింది."పుట్టినరోజు శుభాకాంక్షలు తాతయ్యా...మీరు ఒక్కరోజు కూడా కంటి నిండా నిద్రపోలేదు. అయినా, నాపై మాత్రం ఎనలేని ప్రేమను, ఆనందాన్ని కురిపించారు. నేను బాగుండాలనే మీ జీవితాన్ని గడిపారు. మీరు బాగుండేలా చూసుకోవడానికి నా జీవితాన్ని అంకితం చేస్తానని మాటిస్తున్నాను.ఇది చాలా కష్టమైన లక్ష్యమని నాకు తెలుసు. కానీ, మీలాగే నిజాయతీగా, దయతో, ధర్మంగా ఉండటానికి ప్రయత్నిస్తాను. ఈ ప్రపంచంలో అన్నిటికంటే ఎక్కువగా మిమ్మల్ని ప్రేమిస్తున్నాను..." అంటూ హిమాన్షు ట్వీట్ చేశాడు.