|
|
by Suryaa Desk | Tue, Mar 03, 2026, 02:21 PM
ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ తన వినియోగదారులకు శుభవార్త చెప్పింది. సోమవారం జరిగిన కార్యక్రమంలో ఐఫోన్ 17 సిరీస్‌లో భాగంగా సరికొత్త, అత్యంత శక్తివంతమైన 'ఐఫోన్ 17ఈ' స్మార్ట్‌ఫోన్‌ను ఆవిష్కరించింది. దీంతో పాటు శక్తివంతమైన ఎం4 చిప్‌తో కూడిన కొత్త ఐపాడ్ ఎయిర్‌ను కూడా మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది. ఐఫోన్ 17ఈ మోడల్ అత్యాధునిక ఏ19 చిప్‌తో పనిచేస్తుందని, ఇది మునుపటి కంటే వేగవంతమైన పనితీరును అందిస్తుందని యాపిల్ వెల్లడించింది.ఐఫోన్ 17ఈలో యాపిల్ స్వయంగా రూపొందించిన లేటెస్ట్ జనరేషన్ సెల్యులార్ మోడెమ్ 'సీ1ఎక్స్'ను అమర్చారు. ఐఫోన్ 16ఈలోని సీ1 మోడెమ్‌తో పోలిస్తే ఇది రెండు రెట్లు వేగంగా పనిచేస్తుంది. ఇక కెమెరా విషయానికి వస్తే, ఇందులో 48 మెగాపిక్సెల్ ఫ్యూజన్ కెమెరాను ఏర్పాటు చేశారు. ఇది అద్భుతమైన ఫొటోలతో పాటు, నెక్స్ట్ జనరేషన్ పోర్ట్రెయిట్స్, 4కే డాల్బీ విజన్ వీడియోలను రికార్డ్ చేయగలదు. ఇందులో ఆప్టికల్ క్వాలిటీ 2ఎక్స్ టెలిఫోటో సదుపాయం ఉండటం వల్ల ఒకే ఫోన్‌లో రెండు కెమెరాలు ఉన్న అనుభూతిని ఇస్తుంది. ఈ ఫోన్ 6.1 అంగుళాల సూపర్ రెటినా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లేను కలిగి ఉంది. దీనికి 'సిరామిక్ షీల్డ్ 2' రక్షణ కల్పించారు. ఇది గత తరం ఫోన్ల కంటే మూడు రెట్లు అధికంగా గీతలు పడకుండా కాపాడుతుంది. బ్లాక్, వైట్, మరియు సరికొత్త సాఫ్ట్ పింక్ రంగుల్లో లభించే ఈ ఫోన్ ప్రీమియం మ్యాట్ ఫినిష్‌తో వస్తుంది.ఐఫోన్ 17ఈ ప్రారంభ ధర రూ.64,900గా నిర్ణయించారు. విశేషమేమిటంటే, గతంలో ఇదే ధరకు లభించే ఎంట్రీ లెవల్ స్టోరేజీని ఈసారి రెట్టింపు చేశారు. అంటే రూ.64,900 ధరకు 256 జీబీ స్టోరేజ్ లభిస్తుంది. ఇది ఐఫోన్ 12తో పోలిస్తే 4 రెట్లు ఎక్కువ స్టోరేజ్ కావడం గమనార్హం. దీనివల్ల యూజర్లు ఎక్కువ ఫొటోలు, వీడియోలు, గేమ్స్ స్టోర్ చేసుకోవచ్చు. ఐఓఎస్ 26 పవర్ మేనేజ్‌మెంట్‌తో బ్యాటరీ రోజంతా వస్తుందని కంపెనీ తెలిపింది.