|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:19 PM
ఆమనగల్లు గ్రామంలోని శ్రీ పార్వతీ రామలింగేశ్వర స్వామి జాతర ఆనాటి సంస్కృతికి ప్రతిబింబంగా నిలుస్తుందని డీఎస్పీ రాజశేఖరరాజు అన్నారు. ఆదివారం ఆయన జాతరను, క్రీడా పోటీలను ప్రారంభించి మాట్లాడారు. ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని, ప్రజలందరూ కులమతాలకు అతీతంగా జాతరను జరుపుకోవాలని కోరారు. అనంతరం గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ బ్రహ్మదేవర విద్యాసాగర్, సర్పంచ్‌లు పిల్లల సందీప్, అర్చకులు రెంటాల సతీష్ శర్మ తదితరులు పాల్గొన్నారు.