|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:18 PM
చంద్రగ్రహణం కారణంగా, మార్చి 3వ తేదీన ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని వేములవాడ భీమన్న ఆలయం మూసివేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఆ రోజు తెల్లవారుజామున ప్రాతఃకాల పూజలు ముగిసిన వెంటనే ఆలయ ద్వారాలను మూసివేస్తారు. వేములవాడ భీమన్న ఆలయంలో తిరిగి రాత్రి 7 గంటలకు పూజలు నిర్వహిస్తారు. కొండగట్టులో మార్చి 4వ తేదీన భక్తులకు దర్శనాలు కల్పించనున్నట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని సూచించారు.