|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:42 AM
నకిరేకల్ మండలం మంగళపల్లి గ్రామంలో మహిళా సాధికారతకు దోహదపడేలా నూతన మహిళా సమాఖ్య సంఘం భవనం నిర్మాణానికి, అలాగే రూ. 25 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణానికి ఎమ్మెల్యే వేముల వీరేశం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మహిళా సంఘాలకు సొంత భవనం వల్ల సమావేశాలు, శిక్షణా కార్యక్రమాలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని, మెరుగైన రహదారి సదుపాయం ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.