|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:49 PM
తెలంగాణ పశుసంవర్థక, క్రీడలు, యువజన శాఖ మంత్రి వాకిటి శ్రీహరి సంచలన కామెంట్స్ చేశారు. తనను చంపేందుకు ప్రత్యర్థులు కుట్రలు చేశారని హాట్ కామెంట్స్ చేశారు. వారి తాటాకు చప్పుళ్లతు కాను బయపడే ప్రసక్తి లేదని అన్నారు. మక్తల్ నియోజకవర్గం ఉట్నూర్ మండలం పులిమామిడి గ్రామంలో శుక్రవారం (ఫిబ్రవరి 27) పర్యటించిన మంత్రి శ్రీహరి పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. గ్రామంలో రూ.3.25 కోట్ల వ్యయంతో నిర్మించనున్న 33/11 కేవీ సబ్‌స్టేషన్ శంకుస్థాపన చేశారు.
అనంతరం అక్కడే ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసగించారు. కొందరు తాను చేస్తున్న అభివృద్ధి తట్టుకోలేక అడుగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని అన్నారు. టెండర్లకు వెళ్లిన పనులను కూడా మధ్యలో ఆపివేయిస్తూ ప్రాంత అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఫైరయ్యారు. మన ప్రాంత భవిష్యత్తు కోసం కృషి చేయకపోతే ఈ భూమ్మీద బతికి దండగా అని వ్యాఖ్యనించారు. గొప్పగా బతకడం అంటే జల్సాలు చేయడం కాదు అని చెప్పుకొచ్చారు. తనపై తీవ్ర విమర్శలు చేస్తున్నారని.. అయినా సరే ప్రజల అండదండలు ఉన్నంతవరకు ఎవరికి భయపడబోనని వెల్లడించారు.
'అడుగడుగునా ఇబ్బందులు పెడ్తున్నరు. కాళ్లల్లో కట్టెలు పెట్టి కింద పడేస్తున్నరు. దేనికీ ఒప్పుకోకపోయేసరికి బట్ట కాల్చి మీద వేస్తున్నరు. ఎంత వేసినా.. ప్రజల ఆశీర్వాదం ఉన్నంత వరకు నాలోపల, నా రక్తంలో డెవలమెంట్ చేయాలన్న కసి ఉన్నంత వరకు ఈ తాటాకు చప్పుళ్లకు మీ తమ్ముడు శ్రీహరి భయపడడు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఆఖరకు ఓ సందర్భంలో నన్ను చంపాలనే ప్రయత్నం కూడా చేశారు. చావు అనేది ఆ దేవుడే ఇవ్వాలి. ఆయన అనుకుంటే ఆ టైంకే పోతాం. గంట ముందు పోవాలన్నా అవకాశం ఉండదు. అది డిసైడ్ చేసేది భగవంతుడు. ఈ పిచ్చి మనుషులు నన్నేం చేయలేరు. ప్రతి రోజూ బతికి చస్తా ఉంటా. జీవితం మీద ప్రేమ లేనోడిని నేను. ఈ చావులకు బయపడేటోడిని కాదు. నిరంతరం ప్రజల కోసమే పని చేస్తా.' అని వాకిటి శ్రీహరి కీలక కామెంట్స్ చేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం హాట్ టాఫిక్‌గా మారాయి. ఆయన్ను చంపేందుకు ఎవరు కుట్రలు చేశారా? అని ప్రజలు చర్చించుకుంటున్నారు.