|
|
by Suryaa Desk | Sat, Feb 28, 2026, 07:49 PM
మెహిదీపట్నం పరిధిలోని పాత మల్లేపల్లి వార్డు, బయోటెక్ మెయిన్ రోడ్డులో తెలెత్తిన దీర్ఘకాలిక సీవరేజ్ ఓవర్‌ఫ్లో సమస్య పరిష్కార పనుల భాగంగా చేపట్టిన సీవరేజ్ పైప్ లైన్ నిర్మాణ పనులను జలమండలి ఎండీ అశోక్ రెడ్డి జేఎండీ మయాంక్ మిట్టల్ తో కలిసి పరిశీలించారు.ఈ సందర్భంగా సీనియర్ కేఫ్ హోటల్ నుండి ఆర్‌కే పాన్ షాప్ వరకు చేపట్టిన పైప్‌లైన్ నిర్మాణ పనులను అధికారులు సమీక్షించారు.ఈ సందర్భంగా ఎండీ మాట్లాడుతూ.. స్థానికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా, సీవరేజ్ ఓవర్‌ఫ్లో మరింత పెరగకుండా ఉండేందుకు, సీవర్ లైన్‌లో సజావుగా ప్రవాహం కొనసాగేందుకు మాన్‌హోల్ నుండి మాన్‌హోల్ వరకు తక్షణమే డీ-వాటరింగ్ పంపులను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.అలాగే పైపులైన్ విస్తరణ పనులు పూర్తి అయిన వెంటనే రోడ్డు పునరుద్ధరణ పనులను చేపట్టాలని అన్నారు. అలాగే నిర్మాణ వ్యర్థాలను ఎప్పటికప్పుడు తొలగించాలని సూచించారు.మాన్ హోల్ నిర్మాణంలో సరైన నాణ్యత పాటించాలని,మాన్ హోల్ లోపల వైపు సైతం ప్లాస్టరింగ్ తప్పనిసరిగా ఉండేలాగా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో జలమండలి హైదరాబాద్ రీజియన్ ఈడీ సామ్రాట్ అశోక్, ఆపరేషన్ డైరెక్టర్ వినోద్ భర్గవ, సీజీఎం ప్రభు, జీఎం, డీజీఎం తదితరులు పాల్గొన్నారు.