|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 03:05 PM
ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ సంయుక్త దాడుల్లో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా కలకలం రేగింది. ఈ సంఘటన నేపథ్యంలో హైదరాబాద్ నగరానికి సంబంధించిన ఒక ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. భాగ్యనగరంలో ఇరాన్ అధినేత ఖమేనీ పేరుతో ఒక రోడ్డు ఉందన్న వార్త చాలామందిని ఆశ్చర్యపరిచింది. అయితే, ఆ రోడ్డుకు ప్రస్తుతం మరణించిన అలీ ఖమేనీ పేరు పెట్టలేదని, దాని వెనుక బలమైన చారిత్రక కారణాలు ఉన్నాయని స్పష్టమవుతోంది.హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ రోడ్ నంబర్ 7నే అధికారికంగా 'ఇమామ్ ఖమేనీ రోడ్' అని పిలుస్తారు. జీవీకే మాల్ ఎదురుగా ఉన్న ఈ రహదారిలోనే ఇరాన్ కాన్సులేట్ జనరల్ కార్యాలయం కూడా ఉంది. అయితే, ఈ పేరు ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ వ్యవస్థాపకుడు, మొదటి సుప్రీం లీడర్ అయిన గ్రాండ్ అయతొల్లా రుహోల్లా ముసావీ ఖొమైనీ జ్ఞాపకార్థం పెట్టారు. ఆయన మరణానంతరం అలీ ఖమేనీ ఇరాన్‌కు రెండవ సుప్రీం లీడర్‌గా బాధ్యతలు స్వీకరించారు.