|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 02:02 PM
బీరంగూడ : ప్రస్తుత పోటీ ప్రపంచంలో మనిషి జీవితంలో క్రీడలు భాగం కావాలని పటాన్చెరు శాసన సభ్యులు గూడెం మహిపాల్ రెడ్డి అన్నారు. బీరంగూడ డివిజన్ పరిధిలోని మల్లికార్జున హిల్స్ కాలనీలో ఆదివారం సాయంత్రం ఏర్పాటు చేసిన మల్లికార్జున హిల్స్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమానికి ఎమ్మెల్యే జి.ఎం.ఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నూతనంగా ఏర్పాటవుతున్న కాలనీలలో వ్యక్తుల మధ్య ప్రేమ, ఆప్యాయత, అనుబంధాలు పెంపొందించడంలో ఇలాంటి క్రీడా పోటీలు ఎంతగానో దోహదపడతాయని అన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో శారీరక శ్రమ లేకపోవడం మూలంగా అనారోగ్యానికి గురవుతున్నారని తెలిపారు. ప్రతి రోజు గంటసేపు వ్యాయామానికి సమయం కేటాయించి ఆరోగ్యకరమైన జీవనాన్ని కొనసాగించాలని కోరారు. ప్రతి సంవత్సరం మల్లికార్జున హిల్స్ ప్రీమియర్ లీగ్ పేరుతో క్రీడా పోటీలు నిర్వహించడం పట్ల నిర్వాహకులు నందారం రమేష్ గౌడ్ ను ఆయన అభినందించారు. అనంతరం విజేతలకు నగదు బహుమతులు, ట్రోఫీలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అమీన్పూర్ మాజీ ఎంపీపీ దేవానందం, అమీన్పూర్ మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ నరసింహ గౌడ్, మాజీ కౌన్సిలర్లు, సీనియర్ నాయకులు, కాలనీ సభ్యులు పాల్గొన్నారు.