|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 12:53 PM
మదర్ డైయిరీ అభివృద్ధికి నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డు కృషి చేస్తోందని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే శ్రీ బీర్ల అయిలయ్య గారు తెలిపారు.గుజరాత్ లో నేషనల్ డైయిరీ బోర్డు ఛైర్మన్ డాక్టర్ మినేశ్ గారితో తెలంగాణ రాష్ట్ర పశుసంవర్ధక,మత్స్య శాఖ మంత్రివర్యులు వాకిటి శ్రీహరి గారు,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్,ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య గారు,భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారు,విజయ డైరీ చైర్మన్ గుత్త అమిత్ రెడ్డి గారు,మదర్ డైయిరీ చైర్మన్ మధుసూదన్ గారు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బీర్ల అయిలయ్య గారు మాట్లాడుతూ.మదర్ డైయిరీ సంస్థ బలోపేతం ద్వారా పాల ఉత్పత్తిదారులకు మెరుగైన ధరలు, వినియోగదారులకు నాణ్యమైన పాలు మరియు పాల ఉత్పత్తులు అందుబాటులోకి రావడం జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. డైయిరీ రంగం అభివృద్ధి గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు బలాన్నిస్తుందని, రైతుల ఆదాయాన్ని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన అన్నారు.ఈ సందర్భంగా నేషనల్ డైయిరీ డెవలప్మెంట్ బోర్డు సహకారంతో మదర్ డైయిరీ విస్తరణ, సాంకేతిక ఆధునీకరణ, బలోపేతం వంటి చర్యలు వేగవంతం అవుతున్నాయని తెలిపారు. రైతులకు శిక్షణ, పశుసంవర్ధక సేవలు, మార్కెటింగ్ సదుపాయాలు అందించడం ద్వారా పాల ఉత్పత్తి రంగంలో స్థిరమైన అభివృద్ధి సాధ్యమవుతుందని ఆయన నమ్మకం వ్యక్తం చేశారు.మదర్ డైయిరీ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని, రైతు సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.