|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 11:03 AM
TG: హైదరాబాద్ గచ్చిబౌలిలో బెంజ్ కారు ట్రాఫిక్ కానిస్టేబుల్‌ను ఈడ్చుకెళ్లిన ఘటన సంబంధించి సీసీ ఫుటేజ్ వెలుగలోకి వచ్చింది. నానక్‌రామ్‌గూడ వద్ద అతివేగంగా దూసుకువచ్చిన కారు డ్రైవర్ మరో కారును ఢీకొట్టి ఆగకుండా జారుకున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న గచ్చిబౌలి ట్రిపుల్ ఐటీ జంక్షన్ వద్ద విధుల్లో ఉన్న కానిస్టేబుల్ కారును ఆపేందుకు ప్రయత్నించారు. కానిస్టేబుల్ వైపు కారు దూసుకురావడంతో ఆయన బానెట్ పై పడిపోవడంతో దాదాపు కిలోమీటర్ మేర అలాగే ఈడ్చుకెళ్లాడు. ఇతర వాహనదారుల సహాయంతో పోలీసులు కారును ఆపి డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.