|
|
by Suryaa Desk | Mon, Mar 02, 2026, 10:55 AM
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో, మున గనూరు ఇందిరమ్మ కాలనీకి చెందిన పోలోజు రజిత (35) తన భర్త రవీంద్ర చారితో గొడవపడి, తన పన్నెండేళ్లలోపున్న ఇద్దరు కుమార్తెలతో కలిసి శనివారం ఇంట్లోంచి వెళ్లిపోయింది. స్థానికంగా, బంధువుల ఇళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. ఆదివారం ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.